ఆన్‌లైన్ వర్క్‌షాప్ మార్గదర్శకాలు
ఆన్‌లైన్ వర్క్‌షాప్‌కు ముందు అనుసరించాల్సిన మార్గదర్శకాలు:
-
- ఇందులో పాల్గొనేవారు (అనగా గర్భిణీ స్త్రీ) తమ రిజిస్టర్డ్ పేరుతో సెషన్‌లో చేరాల్సి ఉంటుంది. మీరు మరొక ID ద్వారా లాగిన్ చేసి ఉంటే, దయచేసి జూమ్‌లో మీ పేరును సరిగా మార్చుకోగలరు. భర్త పేరు తో లాగిన్ చేసి ఉంటే అది భార్య పేరుకి మార్చుకోవలసింది గా మనవి. ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
- కాబోయే తల్లితో పాటు వారి భాగస్వామ్యులు కూడా వర్కుషాప్ కు హాజరు కావలసిందని మనవి.
- వర్క్‌షాప్ ప్రారంభం కావడానికి కనీసం ఒక గంట ముందు జూమ్ లింక్ మీతో షేర్ చేయబడుతుంది
- వర్కుషాప్ లోని భజనలు ఇక్కడ పొందుపరచడం జరిగింది: ఓజస్ వర్కుషాప్ భజనలు: Ojas – English | Ojas – Telugu | Ojas – Hindi వేధస్ వర్కుషాప్ భజనలు: Vedhas – English | Vedhas – Telugu
- ఈ క్రింద రెండు వీడియోలను వర్కుషాప్ హాజరుకాకముందరే తప్పక చూడవల్సిందిగా ప్రార్ధన:
ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ మార్గదర్శకాలు
ఆఫ్‌లైన్ వర్క్‌షాప్‌కు ముందు అనుసరించాల్సిన మార్గదర్శకాలు:
-
- రిజిస్టర్ చేసుకున్న గర్భిణీ స్త్రీ శనివారం ఉదయం 8:45 గంటలకు సెషను లో తప్పక భర్తతో కలిసి పాల్గొనాలి. భర్త అందుబాటులో లేనిపక్షాన, మీతో పాటు తప్పనిసరిగా వేరొక వ్యక్తి – మీ అమ్మ/అత్తగారు/మీ సన్నిహితులు ఎవరైనా పాల్గొనాలి.
- మీ సెల్ ఫోన్లను వేదిక వద్ద డిపాజిట్ చేయాలి. అవి వర్క్‌షాప్ తర్వాత మీకు తిరిగి ఇవ్వబడతాయి.
- వర్క్‌షాప్‌కు ముందు అల్పాహారం తీసుకొనిరావాలి. మేము మఠంలో సెషను మధ్య విరామ సమయంలో స్నాక్స్ అందిస్తాము.
- వస్త్ర నిబంధన:మహిళలు: సల్వార్,కమీజ్‌తో కూడిన దుపట్టా తప్పనిసరి.పురుషులు: యోగా అభ్యాసానికి తగిన, వదులుగా సౌకర్యవంతమగు దుస్తులు.
- ఈ క్రింద రెండు వీడియోలను వర్కుషాప్ హాజరుకాకముందరే తప్పక చూడవల్సిందిగా ప్రార్ధన: